Sri Narasimha Government High School Old Students Association

Celebrating 75 Years of Excellence

SNH వజ్రోత్సవం Souvenir

”వజ్రపువెలుగులు” అపీల్

(గమనిక: సావనీర్ పేరు ఇంకా నిర్ణయించలేదు. ఇది తాత్కాలికం)

శ్రీ నారసింహోన్నత పాఠశాల-పాలపఱ్ఱు

పూర్వ విద్యార్థి మిత్రులకు🙏

మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక 14/1/25 జరిగిన సమావేశం మరియు 16/3/25 జూమ్ లో అందరి అభిప్రాయాలు ను సమీక్షించి “మన పాఠశాల వజ్రోత్సవవేడుకలో“ మన పాఠశాల తో మన అనుబంధాన్ని సావనీర్ రూపంలో ప్రచురించడానికి నిర్ణయమైనదని మీ అందరికీ తెలియజేయుచున్నాం.

ఈ సావనీర్ కు మన పాఠశాల తో మీ బంధాలు-అనుబంధాలు, మీ జీవన గమనం-పురోభివృద్ధి లో మన పాఠశాల లో మీరు నేర్చుకున్న విద్యాబోధన, క్రమశిక్షణ ఏవిధంగా దోహదపడింది అనే అంశాలపై క్లుప్తంగా 2 లేదా 3 పేజీలు లో తెలియజేస్తూ 05/04/25 లోగా DTP చేసి snhsouvenir75@gmail.com పంపవలెనని సవినయంగా తెలియచేస్తున్నాం.

మీ లాంటి విజ్ఞులు, ఉన్నత విద్యావంతుల అభిప్రాయాలు, అనుభవాలు, అనుభూతులు భావి తరానికి దిక్సూచిగా నిలుస్తాయని భావిస్తున్నాం. మన పాఠశాల గత చరిత్ర రాబోయే భావితరాలకు ఒక డాక్యుమెంటరీ గా యుంటుందని అందులో మీరు తప్పక భాగస్వాములు అవుతారని ఆకాంక్షిస్తున్నాం.

ఈ సావనీర్ కు సంబంధించిన ఇతర వివరాలు ను సావనీర్ కమిటి సభ్యులు నుండి పొందగలరు.

గమనిక:

వ్యాసం తో పాటు మీ పాస్పోర్ట్ ఫొటో, మీ పూర్తి అడ్రస్, పంపగలరు.

సావనీర్ కమిటీ